ఎమున్నది మహిలొ? ఎక్కడున్నది మానవత్వం?
ధనవంతుల దాహం దరిద్రుల దహనం
ఉన్నవాడు లేనివాడి ఆఖరి నెత్తుటి బొట్టుని సైతం పీల్చుకొనే సమాజం
మనిషి మరో మనిషిని అమాంతం మింగేసే మృగం
ఎమున్నది మహిలొ? ఎక్కడున్నది మానవత్వం?
ఉనికి అబద్దం; బ్రతుకు వృధా
ఒకరి చెమట మరొకరి పన్నీరు!
నిస్సహయంగా మనలనే చూస్తు ఏడుస్తున్న భూమాత
నిన్న చీకటి; రేపు అగాధం; నేడు ఎందుకున్నదొ తెలియని జీవితం!
ఏం మిగిల్చాం మన భావి తరాల కోసం?
మంచివాడు మూగవాడు
చెడ్డవాడు చాలా అదృష్ఠవంతుడు!
రాబందుల రాజ్యం; జలగల మద్య జీవనం
విద్వంశం సృష్టిస్తున్న మనిషిలోని మృగం
ఎమున్నది మహిలొ? ఎక్కడున్నది మానవత్వం?