Sunday, December 5, 2010

విశ్వమానవ భ్రాత్రుత్వం, సర్వజీవ సౌభాగ్యం

విశ్వమానవ భ్రాత్రుత్వం, సర్వజీవ సౌభాగ్యం ఇదే ఇదే నా చిరకాలపు చిరు ఆశ
నా జీవిత కాలంలో ఇది తీరేనా? నా చిరు కల నిజమయ్యేన?
భూమాత ఒడిలో పుట్టిన ప్రతి బిడ్డకు నవ్వులు కలిగేనా?
ఈ ప్రపంచం సుఖ శాంతిమాయమైనా?
విశ్వమానవ భ్రాత్రుత్వం, సర్వజీవ సౌభాగ్యం ఇదే ఇదే నా చిరకాలపు చిరు ఆశ

సొంత లాభం కొంతమానుకొని పొరుగువానికి తోటిపడమన్న గురజాడ మాట పాటిద్దాం
చేయి చేయి కలిపి ఆకలి దప్పుల ఆర్తులకు ఆసరాగా నిలుద్దాం
మనమంతా శ్రామికులం, మనకున్నది ఒకే మతం - ప్రేమ మతం.
ప్రతి వ్యక్తికి అవకాసం; ప్రతి పనికి గౌరవం; తల ఎత్తుకొని తిరిగే సమాజం;
ఇదే ఇదే మన లక్ష్యం కావలి.  

మన మతులు గమ్మతుగా మారే నేడు.
విలువలు, వివేకం, విచక్షణ లేని విద్య మిగిలింది చూడు.
వినేవారేవ్వారు మౌలిక వసతలు కూడా లేని వారి గోడు?
విశ్వమానవ భ్రాత్రుత్వం, సర్వజీవ సౌభాగ్యం ఇదే ఇదే నా చిరకాలపు చిరు ఆశ

అంధకారం నిండిన అవనిలో చిరుదివ్వెలు మనమౌదాం
ప్రేమ పునాదులపై శాంతి సౌధాలు నిర్మిద్దాం
నిరాశ, నిస్పృహలెరుగని మరో తరానికి నాంది పలుకుదాం
విశ్వమానవ భ్రాత్రుత్వం, సర్వజీవ సౌభాగ్యం ఇదే ఇదే మన చిరకాలపు చిరు ఆశ