నిన్న ఒక స్నేహితుడు ఉత్తేజ్ వ్రాసి, చదివన ఒక కవిత పంపించాడు.
అసలు video కి లింక్ ఇది:
https://www.youtube.com/watch?v=Jv352avF4YA
ఆ తరువాత సామజిక అనుసందాన వేదికలో ఇది ప్రాచుర్యం పొందినట్టు అనిపించింది. ఇది నా స్పందన
ఒక్క సారి సీటీ బస్సు ఎక్కి చూడు మిత్రమా
పదుల కిలో మీటర్లు నిలుచొని ప్రతీ రోజు ప్రయాణిస్తాం
పని చేసి పొట్ట నింపుకుంటాం - లాంగ్ కట్
ఊరిలో అమ్మ నాన్న, ఊరి గాని ఊరొచ్చి, చేమటోర్చి,
ఇరుకు ఇరుకు అద్దె ఇంట్లో చాలీ చాలని బతుకులతో ఉంటాం
మెస్సులో తింటాం, ఓవర్ టైంలు చేస్తాం ఒంటరిగా బ్రతుకుతాం - లాంగ్ కట్
కులం పిచ్చి మాకు లేదు బాస్ పెద్దోలకుందేమో
తప్పులు చేసి, దేవుడి గుడికెల్లి హుండీలో దక్షిణేసి, రక్షించమని
వేడుకునే బుద్ధి పెద్దలకు ఉందేమో కాని మాకు లేదు
మాది కాని డబ్బు మాకొద్దు, మా కష్టార్జితం మాత్రం మా ఇష్టం
ఉపాది కోసం, మా భవిష్యత్ పునాదుల కోసం పడి గాపులు కాస్తున్నం బాస్ - లాంగ్ కట్
గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లి చూద్దం పద మిత్రమా
కొత్త ఉద్యోగికి చెత్త బుద్దులు ఎవరు నేర్పిస్తున్నారో
అవినీతిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో?
ఒక నిర్భయ విషాదాం జరిగితే మాలో కొన్ని వేల మంది స్పందించాం
ఒక అన్నా పిలుపునిస్తే లక్షల మంది కదలివచ్చాం
ఐఏఎస్, ఐఐటి, ఐఐమ్, ఎంసెట్ గిమ్ సెట్, ఏదైనా కాని ముందు కెళ్ళడమే గాని వెనక్కు తగ్గం - లాంగ్ కట్
ప్రధాన మంత్రిని అడగు బాస్ మేంమేంటో, పూస గుచ్చినట్టు చెబుతాడు,
వాళ్ళ పూనుకుంటేనే ఎన్నికలో గెలిచానని
అక్కడి దాక వెళ్ళలేను షార్ట్ కట్ లో తెలుసుకుంటా అంటే మన ముఖ్య మంత్రులు, మంత్రులు అన్నాను - రెండు రాష్త్రాలు కదా, అడిగి చూడు - లాంగ్ కట్