అదేంటో అమ్మ, నాకు నచ్చిన కూర నీకు ఇష్టం ఉండదు
నాకు ఎక్కువ పెట్టాలి కదా!
అదేంటో, నాకు బాగా ఆకలి వేసిన రోజు నీకు ఆకలి సరిగ వెయ్యదు
నేను ఎక్కువ తినాలి కదా!
నువ్వు నా రెండు చక్రాల బండి ఎక్కి వెనక కూర్చున్న మొట్ట మొదటి రోజు
నీకేం కాకుండా నేను జాగ్రత్తగా నడపాలి అని నే పడ్డ తపన
పది నెలలు నన్ను మోస్తూ నాకేం కాకూడదని నువ్వు పడ్డ మనో వేదన జ్ఞప్తికి తెచ్చింది
నా పిచ్చికి నాలో నేనే నవ్వుకున్నా.
నీ పుట్టిన రోజు ఎప్పుడో తెలిస్తే బాగున్ను
తెలిస్తే ఏం చేస్తావు అని అడుగుతావా?
ఏం చెయ్యను? - ఏం చెయ్యాలో నాకు తెలీదు.
అందుకేనా నీ పుట్టిన రోజు నీకు కూడా తెలీదు?
అయినా చావు పుట్టుకలు దేవుడికైనా ఉన్నాయోమో కాని అమ్మకి లేవని నా నమ్మకం.
అందరి కంటే నేను ఎక్కువ చిరాకు పడేది ఎవరి మీదనో తెలుసా? నీ మీదనే.
అవును ఇంట్లో ప్రతీ వాళ్ళు నీ మీద కోపం చూపే వారే.
ఎందుకంటే అందరిని మోసే ఆ భూమాత కూడా నీ దగ్గరే సహనం నేర్చుకోవాలని నాకు చెవిలో చెప్పింది.
ఉహా తెలిసి మొహం మీద గెడ్డం గీసే వయస్సు వచ్చిన తరువాత నుండి
నా ఊహా సుందరిలు, కావ్య కన్యలు, బాపూ బోమ్మలు, కలల రాకుమారిలు కోకొల్లలు
కాని నా ప్రేమ సామ్రజ్యానికి ఏకైక మహారాణి మాత్రం నువ్వు అమ్మ
అవును నా ప్రేమకి తోలి చిరునామా నువ్వు
ఆ ప్రేమకి మలి మజిలి కూడా నువ్వే
తల్లిని ప్రేమించే ప్రతీ బిడ్డకి ఈ కవిత అంకితం