మదిలో పదే పదే మెదిలే మధుర భావాలు
రూపం దిద్దుకొలేని కూని రాగాలు
అంతులేని ఆనందం చిగురించిన వేళ
భావానికి భాష్యం చెప్పలేని నా నిస్సహయతని చూసి
నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి
ఒక్క క్షణం నా ఉనికిని గుర్తించానని చెప్పలేని సంతోషం
మరుక్షణం అదే ఉనికిని ఏందుకిచ్చావని భగవంతునిపై కోపం
నా ప్రతి మనోభావాన్ని పదాలలో వ్యక్తపరచాలని వృథా ప్రయాస పడే మనస్సు
నా సాయిని తలచుకొని ఉప్పొంగి పరవశించి పోయే హృదయం
అంతులేని ప్రేమనిచ్చి తీర్చలేని ఋణగ్రస్తుడను చేసిన తల్లిదండ్రులు గుర్తుకొచ్చే క్షణాలు
తమ హృదయాలలో నాకొక స్థానం ఇచ్చిన ఎందరో వ్యక్తులు ఙప్తికి వచ్చే వేళ
మంచి మనిషిగా మనుగడ సాగిస్తే చాలు అని నా స్వామిని ప్రార్ధించే వేళ

No comments:
Post a Comment