విన్న పాటే మళ్ళీ మళ్ళీ వింటావు
పాత చిత్రాలనే పదే పదే పలకరిస్తావు
అవే అవే ఆలోచనలను ఆస్వాదిస్తావు
ఏమైంది మిత్రమా నీ మనసుకి ?
ఉరికి ఉరికి ఉనికి మరచినపుడు
విన్న పాట ఊసులే ఊరటనిస్తున్నాయి
వేగం పెంచే పరుగులో రాగం మరచిన మనసుకి
మమతల లోతులో దాగిన మనిషిని చూపిస్తున్నాయి
మూలం కాస్తా గాలికి వదిలి తియ్యని భాషకు
తీరని లోటును తెచ్చిన తప్పును దిద్దాలంటే
చూసిన కధలే మళ్ళీ మళ్ళీ చూడాలేమో
చదివిన పాఠమే మళ్ళీ
మళ్ళీ చదవాలేమో
గమ్యం తెలియని గమనంలో
హంగుల పొంగుల కాలంలో
స్వార్ధం పెరిగిన సంఘంలో
ఉనికికి అర్ధం వెతకాలంటే
మాటల కొటలు దాటాలేమో
మనసుల లోతులు
ఈదాలేమో
గమనిక: అనుకున్నంత అందంగా ఈ కవిత రాలేదు. అతికినట్టు
అనిపిస్తే మన్నించ మనవి.