నిను చూసే ఆ క్షణం
లయ తప్పును నా హృదయం
నీ తలపులలో గడిపిన కాలం
నా గుండె లోతులలో పదిలం
నీ రూపు నాకు తెలియదు
నా నిరీక్షణ ముగియదు
నా అర్హత చాలదు
అయినా ఆశ చావదు
నాకంటూ ఓ ఉనికి
అనుకుంటూ బ్రతికి
నీ కొరకై వ్రెతికి
నిట్టూర్పే కడకి
ఈ జన్మకి ఇంతేలే
అని పలికె నా మెదడు
ఎవరి రాతఎవరికెరుక
అని ఊరించే నా మనసు
నా కలలు ఆగవు
నా మనసు మారదు
నా ఉనికి నిండదు
నువ్వు - నీకై నా నిరీక్షణ
Nice...
ReplyDeleteధన్యవాదాలు
Deleteఎవరి రాతఎవరికెరుక...
ReplyDeleteనిజమే అయినా నిరీషణే...కదూ!
బాగుంది.
చాలా మంచి గమనిక.
Deleteధన్యవాదాలు
chakkaga raasaarandi.
ReplyDeleteధన్యవాదాలు
Deletechaala bagundhi
ReplyDeletechala bagundi babai.. nee pratikshana tvaralone teeru gaka! :P ;)
ReplyDelete