Tuesday, September 25, 2012

జీతం రోజు

ఇదిగో... ఇదిగో... జీతం రోజు
ఈ పూటకి నే భూతలనికే మహారాజు
ఇదిగో... ఇదిగో... జీతం రోజు
మధ్యతరగతి జీవితాల నెలరాజు

మద్దెల దరువులా వాయిస్తూ అద్దెల బరువులు
సొంత గూడుకై గొప్పగ చేసిన అప్పుల తిప్పలు
భవిష్యత్తుపై భాద్యత దాచిన డబ్బుల లెక్కలు 
మినహాయిస్తే మిగిలిన మొత్తం వేయి పదులు.

సినిమాకెళితే జొన్నల ఖరీదు వందలు
హోటలుకెలితే కోటలు దాటే రేటులు
బట్టలు కొన్నా జేబుకు తప్పవు చిల్లులు
దీనికి తోడు అన్నిటి మీదా వ్యాటులు

అన్ని ఖర్చులకు కార్డు గీకుతాం
నెలంతా అలాగే బతికేస్తాం
ఈ రోజు మాత్రం దున్నేస్తాం
ప్రపంచానికే దశ నిర్దేశిస్తాం

ఇదిగో ఇదిగో జీతం రోజు
ఈ పూటకి నే భూతలనికే మహారాజు
ఇదిగో ఇదిగో జీతం రోజు
మధ్యతరగతి జీవితాల నెలరాజు


2 comments:

  1. :):) బాగా వ్రాశారండీ!
    ఇది చదువుతుంటే నాకు అమ్మో! ఒకటో తారీఖు అనే సినిమా గుర్తొచ్చింది :)

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతులు :-)

      Delete