అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్నివీలైతే విమానం లేకుంటే ధూమ శకటం
కాకుంటే కారులో లేకుంటే కాళ్ళతో
పాకూతూ, జారూతూ, ఆగుతూ చేరుకో
అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్ని
అందరూ అబ్దుల్ కలాం అవ్వాలని రూలు లేదు
అలాగని దిగాలు పడి డభేల్ దిభేల్ పడ వద్దు
పిండి కొద్ది రొట్టి - శ్రమకొద్ది ఫలితం
ముందుకే గాని వెనకి కాదు నీ పయనం
అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్ని
కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి
కష్టపడి ముందుకెళితే మైల్ల్లైన తరుగుతాయి
దూరంతో బేరమేల? ప్రయత్నం ఉంటే చాలు కద!
అలసిపోయి ఉన్నావా? ఆపకు నీ గమనాన్ని
ఆగి ఆగి వెళ్ళినా చేరుకో గమ్యాన్ని
గమనిక: ఈ కవిత స్వామి వివేకానందుడి పుట్టిన రోజుని పురస్కరించుకొని వ్రాయడం జరిగింది. అందుకు వారి యువతకి ఇచ్చిన నినాదంలోంచి ఈ కవితకి పేరు పెట్టాను. తప్పులును మన్నించమని మనవి.
Very inspiring Annayya.. Keep it coming!
ReplyDeleteNuvvu super Sasi..😊
ReplyDelete