జారి పడ్డ నిన్ను చూసి లోకం జాలిగా చూసిందని బాధ పడకు నేస్తం
గేలి చేసినంత మాత్రం చేత లేచి నిలబడలేవని అనుకోకు
ధూళి దులిపి కాలు కదిపి అడుగు పడనివ్వు
ఆగిపోయిన నిన్ను చూసి ఆగలేని కాలం నిస్సహయత అర్ధం చేసుకో
ఆగడం తెలియని నీ గుండె మీద చెయ్యి వేసి ఆఖరిగా ఇంకొక్కసారి నడిచి చూడు
నీ ప్రతి నిట్టూర్పూ ఒక నిప్పు రవ్వ - నీ ప్రతి కన్నీరూ ఒక కర్మ ధార
నీ కదలిక ఒక ఉనికికి ప్రతీక - నీ నెత్తురు సత్తువ నిద్ర మత్తులో మర్చిపోకు
తల తెగని, రొమ్ము విరగనీ - జాలి, గేలి, కేళి దాటేసిన నువ్వు ఎవ్వరికి బానిస కావు
నిన్ను అయితే కొట్టగలరు, తిట్టగలరు, చెడగొట్టగలరు - కానీ నీ ఆలోచన నీ కన్నా గొప్పది
ఆ ఆలోచన అణచాలంటే అంత సులువు కాదు - అది నీకు కూడా సాధ్యం కాదు
ఎన్ని సార్లు పడిన చచ్చినట్టు లేవాలి - ఎంత బ్రతుకు బ్రతికినా చచ్చినట్టు చావాలి
ఉనికి అన్నది ఉన్న వరకు పోరాటం తప్పదు -విసుగన్నది ఉన్న వరకు ఆరాటం తీరదు

This comment has been removed by a blog administrator.
ReplyDelete