ఏమని వ్రాయను? నేనేమని వ్రాయను?
శౌకర్యపు హంగులలొ మరచిపోయిన మనస్సు గురించి వ్రాయనా?
పని వత్తిడిల వల్ల వదులుకోబొయే కనుపాపల నిదుర గురించి వ్రాయనా?
నేనెవరో, నా ఉనికికి అర్ధమెమిటిటో అని ప్రశ్నించుకోవడానికి కూడ తీరిక లేని ఈ కొత్త జీవితం గురించి వ్రాయనా?
అందరి మధ్య తిరుగుతూ వున్నా ఒక్కసారిగా ఒంటరి బాటసారినని మదన పడిన వేల క్షణాల గురించి వ్రాయనా?
నా స్వామినెప్పుడు చేరుకుంటానొ తెలియక, ఆ విరహపు శిఖరాగ్రములకు చే రుకోలెక నేను పడే వ్యధ గురించి వ్రాయనా?

కర్మ మార్గమే నా బాటని తెలిసికూడా ఈ మజిలీ గురించి అలోచించి అలోచించి నే విడిచిన లక్షలాది నిట్టూర్పల గురించి వ్రాయన?
ఏమని వ్రాయను? నేనేమని వ్రాయను?
No comments:
Post a Comment