ఏదీ నీ కొత్త కవిత?
ఏదో రాద్దామని కలం, కాగితం పట్టాను;
కాని ఏదీ తోచక ఆలోచనా పథం పట్టను.
ఏదొ రాయలని ఉబలాటం - కాని భావాలు వ్యక్తపరచలేని నిస్సహయం!
ఏదీ నీ కొత్త కవిత?
మది సాగర మథనంలో తల మునకయ్యాను;
ఆలోచన ప్రవాహనికి ఆనకట్ట వెయ్య యత్నించాను
ఏదో చెయ్యలని ఉత్సాహం - కాని శ్రద్దాశక్తులను కేంద్రీకరించలేని నిస్సహాయం!
ఏదీ నీ కొత్త కవిత?
ఇప్పుడే వంట చేయడం నేర్చుకుంటున్న కొత్త కోడలి పాట్లు, అగచాట్లు నా కొత్త కవిత
ఇప్పుడే స్వరాలు సమకూరూస్తున్న సంగీతకారుడి తపన నా కొత్త కవిత
ఇప్పుడే చిన్న చిన్న తప్పటడుగులు వేస్తున్న పాప నడక నా కొత్త కవిత.
No comments:
Post a Comment